ఈ క్రాప్ తో ప్రయోజనాలు జాస్తి
1 min readపల్లెవెలుగు, వెబ్ వెలుగోడు: జిల్లా వ్యవసాయాధికారి . మోహన్ రావు అన్నారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనే యులు ,ఉద్యాన సహాయకులు వెంకట శివుడు ఆధ్వర్యంలో రైతు సోదరుల సమక్షంలో వెలుగోడు రైతు భరోసా నందు గురువారం గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ క్రాప్ బుకింగ్ మరియు ఈ కేవై సి 99 శాతం చేయడం జరిగిందని , ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ వివరాలు సామాజిక తనిఖీ కోసం రైతు భరోసా కేంద్రం నందు పొందుపరిచామని , రైతులు పారదర్శకంగా వారి వివరాలను తెలుసుకోవడం కోసం రైతు భరోసా కేంద్రాల్లో పొందుపరచడం జరిగిందని చెప్పారు. ఈ వివరాలలో ఏమైనా మనకు సవరణలు ఉన్నట్లయితే సవరణ చేసుకోవడానికి నాలుగో తేదీ సాయంత్రం వరకు అవకాశం ఇచ్చారు . ఈ క్రాప్ నమోదులో వివరాలు అన్ని సవరణ చేసుకుని పూర్తి స్థాయిలో రైతుల ప్రభుత్వం ద్వారా అందజేయబడిన ప్రతి పథకం వినియోగిoచుకోమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో అగ్రికల్చర్ బోర్డ్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి , గ్రామ సర్పంచ్ జయపాల్ , వ్యవసాయ అధికారి నాగశివ సాయి , శ్రీమతి సుధారాణి , విస్తరణ అధికారులు వెంకట శివుడు , రేణుకాదేవి , రామలక్ష్మి , నాగమణి తదితరులు పాల్గొన్నారు.