అత్యుత్తమ పీఎస్.... పెద్దకడబూరు
1 min read– స్పష్టం చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
– రేపు సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ అవార్డు అందుకోనున్న జిల్లా ఎస్పీ
పల్లెవెలుగు వెబ్, కర్నూలు క్రైం: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి.. వేగంగా పరిష్కరించడంతోపాటు మండలంలో నేరాలను పూర్తిస్థాయిలో కంట్రోల్ చేసినందుకుగాను పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ ఎక్స్‌లెన్సీ అవార్డుకు ఎంపిక చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డీజీపీ/ ఐజీపీల కాన్ప్రెన్స్లో 2020 సంవత్సరానికిగాను ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ ఎంపికైనట్లు వెల్లడించారు. సోమవారం విజయవాడలో డీజీపీ చేతుల మీదుగా సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ అవార్డును కర్నూలు జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బంది యొక్క వ్యవహార శైలి గురించి మరియు ప్రజల నుండి రాబడిన స్పందన ( ఫీడ్ బ్యాక్) , నేర సమాచారం ను ఎప్పటికప్పుడు CCTNS నందు అప్ లోడ్ చేసి డేటా ను భద్రపరచడం, మహిళలపై జరిగే నేరాల గురించి మరియు షెడ్డ్యూల్ కులాలు, షెడ్డ్యూల్ తెగల ప్రజల పై మరియు ఆస్తులకు సంబందించిన నేరాలపై ప్రజలలో కనీస అవగాహన కల్పించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పెద్దకడబూరు పోలీస్ స్టేషన్‌గా ఉత్తమ పీఎస్‌గా ఎంపిక చేసిందన్నారు.