PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏసీబీ వ‌ల‌లో ఉత్తమ స‌ర్పంచ్

1 min read

వికారాబాద్; వికారాబాద్ జిల్లా మ‌న్నెగూడ స‌ర్పంచ్​ ఏసీబీ వ‌ల‌కు చిక్కాడు. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డాడు. క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు హెచ్ఎండీఏ నుంచి అన్ని అనుమ‌తులు ప‌క్కాగా ఉన్నా.. ఓ వ్యక్తిని 13 ల‌క్షలు డిమాండ్ చేశాడు మ‌న్నెగూడ స‌ర్పంచ్ వినోద్ గౌడ్. దీంతో విసుగెత్తిపోయిన స‌ద‌రు వ్యక్తి.. ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదు చేశాడు. అయితే.. ఏసీబీ అధికారుల ప‌న్నిన వ‌ల‌లో అడ్డంగా చిక్కిపోయాడు. ఏసీబీ అధికారులు స‌ర్పంచ్​ వినోద్ గౌడ్ ను అరెస్టు చేశారు. వినోద్ గౌడ్ గ‌త ఏడాది గ‌ణ‌తంత్ర దినోత్సవ వేడుక‌ల్లో ఉత్తమ స‌ర్పంచ్ గా పుర‌స్కారం కూడ అందుకున్నారు.

About Author