రాజీమార్గం ఉత్తమమైన మార్గం.. లోక్ అదాలత్
1 min read
లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించు కోవడం వలన ఇరుపక్షాలు వారు గెలుపొందినట్లే
రాజీమార్గం ఉత్తమమైన మార్గం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు ఏర్పాటుచేసిన ప్రారంభ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి మాట్లాడుతూ కక్షి దారులకు త్వరితగతిన కేసులు పరిష్కారం నిమిత్తం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కక్షి దారులు సౌలభ్యత్వం కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 35 బెంచీలను ఏర్పాటు చేసి త్వరితగతిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు. కావున కక్షిదారులు తమ కేసులు వివరాలతో సంబంధించిన బెంచీలు దగ్గర కేసుల పరిష్కరించు కోవాలని సూచించారు. అలాగే లోక్ అదాలత్ నందు కేసులను పరిష్కరించు కోవడం వల్ల ఇరుపక్షాలు గెలుపొందినట్లు అవుతుందని అదే కోర్టులు ద్వారా వెలువరించిన తీర్పులు ఒకరు గెలవడం మరొకరు ఓడిపోవడం అనేది జరుగుతుందని తెలిపారు. జాతీయ లోక్ ఆదాలత్ నందు కేసులు రాజీ చేసుకోవడం ద్వారా విరుపక్షాలకు సమన్యాయం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ఈరోజు ప్రారంభముగా వాహన ప్రమాద భీమా కేసులో 85 లక్షలు పరిహారము చెల్లించినట్లు, ఇందు గోజిట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు బాధితులకు పరిహారం చెల్లిస్తున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, ఐదవ అదనపు జిల్లా జడ్జి ఆర్.వి.వి.ఎస్.మురళీకృష్ణ, ఏడవ అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు,ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాస మూర్తి,ఫోక్సో జడ్జ్ కుమారి శ్రీవాణి,జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాదు ,ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ కె.కె.వి.బుల్లికృష్ణ,బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు కోనె సీతారాం,ప్రభుత్వ న్యాయవాది బి.జె.రెడ్డి,లోక్ ఆదాలత్ మెంబరు కానాల రామకృష్ణ,న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.