PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లం క‌ర్ణాట‌క !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని అంజనాద్రి కొండ హనుమంతుడి జన్మస్థలమని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. భారత్ దర్శన్ యాత్రలో భాగంగా అంజనాద్రి ఆలయాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలోని విజయనగరం జిల్లా అనెగొండి సమీపంలోని అంజనాద్రి కొండ హనుమంతుని జన్మస్థలం అనే విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదని సూర్య వ్యాఖ్యానించారు. హనుమంతుడి జన్మస్థలంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

                                      

About Author