PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిజెపి ప్రభుత్వానికి ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: గౌరవనీయులు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యులైన సి డబ్ల్యూ సి సభ్యులు 9.10.23. సోమవారం నాడు బీసీల కుల గణన గురించి చర్చించి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని మన ప్రియతమ నేత కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ  చెప్పడం జరిగింది . ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉంది. వారిలో మూడు రాష్ట్రానికి బీసీ వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే బిజెపి ప్రభుత్వం పది రాష్ట్రాలలో అధికారంలో ఉంది. వారిలో 9 మంది అగ్రవర్ణాల వారికి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది కేవలం ఒకే ఒక ముఖ్యమంత్రి బీసీ వర్గానికి చెందిన వారు ఉండడం చాలా బాధాకరం. ఎందుకంటే బిజెపి ప్రభుత్వం కేవలం బీసీలకు మైనారిటీలకు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఓటు కోసం ఉపయోగించుకొని దాని తర్వాత. పట్టించుకోవడంలేదని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఏపీసీసీ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా మరియు బీసీ కులాల వారు రాహుల్ గాంధీ  ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు. జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా మాట్లాడుతూ. దేశంలో ఉన్న బీసీ మిత్రులారా రాబోయే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని జిల్లా సహాయ కార్యదర్శిగా అమానుల్లా కోరడమైనది. ఇటు ఆంధ్రప్రదేశ్లో. ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరిని తెలియజేస్తున్నాను. మిత్రులారా రేపు 2024లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో గాని అసెంబ్లీ ఎలక్షన్లో గాని ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో బీసీ కులాలు అందరూ కలిసి మరియు ఎస్టీ, ఎస్సీ మైనార్టీలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని మిమ్మల్ని అందరిని కోరుచున్నాను మిత్రులకు కాంగ్రెస్ కార్యకర్తలకు బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో ఎం ఖలీల్. బండ్రాలు తిమ్మప్ప. సిద్ధ లింగ. హనుమాన్. రాజు. సయ్యద్ మతిన్. తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.

About Author