నల్ల వాళ్లే లక్ష్యంగా కాల్పులు
1 min readపల్లెవెలుగువెబ్ : అమెరికాలో దారుణం జరిగింది. ఓ యువకుడు సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 10 మంది మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. న్యూయార్క్ రాష్ట్రం బఫెలో నగరంలో శనివారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన జరిగింది. స్థానికంగా నల్లజాతీయులు అధికంగా నివసిస్తుండటం, మృతుల్లో నల్లజాతీయులే ఎక్కువగా ఉండటంతో వారినే లక్ష్యంగా చేసుకొని జరిగిన ‘జాతి విద్వేష దాడి’, ‘విద్వేషంతో కూడిన నేరం’గా పోలీసులు భావిస్తున్నారు. షాపు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రిటైర్డ్ పోలీసు అధికారి, ఆ దుండగుడిని తీవ్రంగా ప్రతిఘటించి ప్రాణాలు కోల్పోయారు.