పడవ బోల్తా.. 17 మంది మృతి
1 min read
పల్లెవెలుగువెబ్ : హైతీ వలసదారులతో అక్రమంగా ప్రయాణిస్తున్న పడవ బహామాస్ సముద్రంలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 17మంది హైతీ వలసదారులు మరణించారు. పడవ బోల్తా పడిన సముద్రంలో బహామియన్ భద్రతా దళాలు 17 మృతదేహాలను వెలికితీశాయి. పడవలో ఉన్న 25 మందిని రక్షించినట్లు హైతీ అధికారులు తెలిపారు.న్యూ ప్రొవిడెన్స్ నుంచి ఏడు మైళ్ల దూరంలో పడవ మునిగిపోయింది. మృతుల్లో 15 మంది మహిళలు, ఒక పురుషుడు, ఒక శిశువు ఉన్నారని ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు.