సీమను 14 జిల్లాలు చేయాలి : బైరెడ్డి
1 min read
పల్లెవెలుగువెబ్ : రాయలసీమను 14 జిల్లాలుగా చేయాలని బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ప్రజల దగ్గరకు పాలన అందిస్తే, జగన్ ప్రజలకు దూరంగా పరిపాలన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నందికొట్కూరును కర్నూలు జిల్లాలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాల విభజన అవకతవకలుగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.