తక్షణమే జాతీయ రహదారి పక్కనున్న ఇటుకుల బట్టీలను తొలగించాలి
1 min read
ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా జాతీయ రహదారి పక్కన ఇటుక బట్టీలు
మట్టి,కాలుష్యం,దుమ్ము,ధూళితో,వాహనదారులకు ప్రమాదాలు
తక్షణమే ఇటుకుల బట్టీలను తొలగించాలనీ కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన: ఏఐటీయూసీ
పల్లెవెలుగు , ఎమ్మిగనూరు : నియోజవర్గంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల వల్ల వచ్చే మట్టి, దుమ్ము,ధూళి,కాలుష్యం, వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరిగి ప్రాణాలు వదులుతున్నారని, కాబట్టి తక్షణమే జాతీయ రహదారి పక్కనున్న ఇటుకుల బట్టీలను తొలగించాలని శనివారం రోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినూత్నంగా కళ్ళు గంతులు కట్టుకుని నిరసన ప్రదర్శనతో సోమప్ప సర్కిల్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి తిమ్మగూరుడు, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్ష,కార్యదర్శు నరసింహరెడ్డి,విజేంద్ర తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 167 జాతీయ రహదారి మరియు ప్రధాన రహదారి అయినా చిన్నాపురం, ముగితి,మంత్రాలయం, ముగితి ఫారం,కోసిగి,ప్రధాన రహదారి కర్నూల్ రోడ్డు లో అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుకుల బట్టిల వల్ల మట్టి కల్లుకు దుమ్ము ధూళి పడుతున్న పట్టించుకునే నాధుడు లేరని, ఈ విషయంపై అనేకసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ఏం మాత్రం స్పందించకుండా దున్నపోతు మీద వర్షం పడే చందంగా వ్యవహరించడం జరిగిందని వారు ఆవేదం వ్యక్తం చేశారు.బట్టీలు కాల్చే సమయంలో పొగతో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుందని, మంత్రాలయం రహదారిలో సంజీవ్ నగర్ పై భాగంలో ఆరు బట్టీలు నిర్వహిస్తున్నారని, ఇలా ఎమ్మిగనూర్ పట్టణం చుట్టూ 18 ఇటుక బట్టీలు ఉన్నాయని చాలా బట్టీలకు ప్రభుత్వ అనుమతులు లేకుండా రాజకీయ నాయకుల అండదండలతో నడుపుతున్నారని వారు తెలిపారు. జాతీయ రహదారులపై వచ్చే వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే తక్షణమే జాతీయ రహదారి పక్కనున్న ఇటుక బట్టీలను తొలగించాలని లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరుగుతుందని వారు తెలిపారు ఇటుకల బట్టీలో 8 మంది కూలీలపై మరణాలపై సమగ్ర విచారణ జరిపించి యజమానులను శిక్షించాలి. ఇటుకుల బట్టిలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుండి ఒప్పంద కూలీలను తీసుకొచ్చి వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా 24 గంటల పాటు పనిచేసే పద్ధతిలో కూలీలతో పనిచేయిస్తున్నారని, వెంకటగిరి ముగితి ఫారం బోడబండ తదితర ప్రాంతాల బట్టీలలో గతంలో ప్రమాదాలు గురై పలువురు మృతి చెందారని వారి మృతి పై సమగ్ర విచారణ జరిపించి అందుకు బాధ్యులైన బట్టి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు సంబంధిత అధికారులకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కేసి జబ్బర్, మాలిక్, మల్లికార్జున గౌడ్, నరసింహులు, లోకేష్, శివకృష్ణ,హనుమంతు,వెంకటేష్, ఆంజనేయ, ఇస్మాయిల్, నాగరాజు, భాష, మన్సూర్, రవి, వీరేంద్ర, దస్తగిరి,రఫిక్, ఖాదర్, విష్ణు, సమీర్,తదితరులు పాల్గొన్నారు.