PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏస్ఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన వర్ధమాన సినీ నటి నేహశెట్టి..

1 min read

– వేలాదిగా తరలివచ్చిన వస్త్ర ప్రియులు..

– తన అంద చందాలతో, హావభావాలతో, నృత్యం  చేస్తూ అలరించిన నేహా శెట్టి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఏలూరులో సినీ నటి నేహశెట్టి వేలాదిమంది వస్త్ర ప్రియుల సమక్షంలో సందడి చేశారు. స్థానిక ఆర్ఆర్ పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏస్ఆర్ షాపింగ్ మాల్ ను ఆమె సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా నేహాశెట్టి మాట్లాడుతూ ఏలూరులో నూతనంగా ఎస్ఆర్ 11 వ బ్రాంచ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వినియోగదారుల అభిరుచులమీద మంచి అవగాహన కలిగి ఉండడం వలన లేటెస్ట్ వెరైటీలు అతి తక్కువ ధరలలో అందించడం జరుగు తుందన్నారు. షాపింగ్ మాల్ లోని అన్ని ఫ్లోర్లలో అమ్మకాలు చేస్తున్న వెరైటీలను ఆమె పరిశీలించారు. ముందుగా నేహశెట్టి  జ్యోతి ప్రజ్వలన గావించారు. తన అంద చందాలతో, హావ భావాలతో, నృత్యం చేసి చేస్తూ ప్రియులను అలరించారు. ఆమె మాట్లాడుతూ కుటుంబంలో అందరికీ నచ్చి మెచ్చే అతి పెద్ద వస్త్రాలయం ఎస్ ఆర్ షాపింగ్ మాల్ అన్నారు. అందరికీ కావలసింది వెరైటీలు ఈ షాపింగ్ మాల్ లో లభిస్తున్నాయని అందరూ వచ్చి కొనుగోలు చేసి మంచి అనుభూతిని పొందాలని అన్నారు. ఆమె మాతృభాష కర్ణాటక అయినప్పటికీ చక్కగా తెలుగులోనే మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎల్ఎన్ ప్రసాద్ రెడ్డి  మాట్లాడుతూ గత 17 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవంతో దేశంలోనే పేరు పొందిన తయారీదారుల నుండి నాణ్యమైన వస్త్రాలను కస్టమర్స్ లకు అందించడం జరుగుతుందని, ఏలూరులో 15000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన పార్కింగ్ సదుపాయం, కుటుంబంలో అందరికి కావలసిన వస్త్రాలు అన్ని ఒకటే చోట కలిగిన సకుటుంబ వస్త్రాలయం. ప్రారంభోత్సవం సందర్భంగా మార్కెట్ లో ఎక్కడా లేని అతి తక్కువ ధరలు కలిగిన ఆఫర్ లను వినియోగించుకోగలరని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు, ఏలూరు టీడీపీ ఇంచార్జ్ బడేటి చంటి, స్థానిక కార్పొరేటర్ తోట హేమాధురి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వి. పూజారి, ఏ శివ కేశవ రెడ్డి, సీనియర్ మేనేజర్,  బ్రాంచ్ మేనేజర్ శివా రెడ్డి, షాపింగ్ మాల్ సిబ్బంది, యాజమాన్యం కొనుగోలు దారులు పాల్గొన్నారు.

About Author