అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు సంక్షేమ బడ్జెట్
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: తెలంగాణా ప్రభుత్వం 2023`24 ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు సంక్షేమ బడ్జెట్ అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం వైస్ చైర్మన్, తెలంగాణా ఎన్సిపి మైనారిటీ విభాగం అబ్జర్వర్ జమీల్ అహ్మద్ బేగ్ అభినందించారు. తెలంగాణా బడ్జెట్లో కిసాన్ రుణమాఫీకి రూ.6,385 కోట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లకు రూ.3,210 కోట్లు కేటాయించి రైతు పక్షపాతి ప్రభుత్వంగా. మైనారిటీల సంక్షేమానికి ముఖ్మమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని జమీల్ అహ్మద్ బేగ్ తెలంగాణా ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.