NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కర్నూలు జిల్లాకు తీరని అన్యాయం

1 min read

హొళగుంద , న్యూస్​ నేడు:  నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ మండల కేంద్రమైన హోళగుందలో ఎంపీడీవో ఆఫీస్ ముందు తాసిల్దార్ నిజాముద్దీన్ వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి పెద్దహ్యట B.మారెప్ప మాట్లాడుతూ జిల్లా ఆదేశాల మేరకు ఫిబ్రవరి 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కర్నూలు జిల్లాకు తీరని అన్యాయం జరిగింది.జిల్లాలో పశ్చిమ ప్రాంతం తీవ్రంగా కరువు కాటకాలకు నిలయముగా మారింది.లక్షలాది కుటుంబాలు వలసబోయి జీవిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం తీవ్రంగా జిల్లాకు అన్యాయం చేసిందని మేము అధికారములోకి వచ్చిన వెంటనే వేదవతి,గుండ్రేవుల రిజర్వాయర్,ఆర్డీఎస్ కుడి కాలువ,నిధులు కేటాయించి పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపి తీవ్రంగా నిరాశపరిచారు. కర్నూలు నగరాభివృద్ధికి జిల్లాలో ఉపాధి కల్పించే నూతన పరిశ్రమలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు.జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయింపులు చేస్తారని జిల్లా ప్రజలు ఆశించారు.వేదవతి ఎల్ఎల్సీ ఆర్డీఎస్ కుడి కాలువలకు కేవలం 30 కోట్ల కేటాయించారు.కె.సి.కెనాల్ ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు, కర్నూలు నగర ప్రజలకు త్రాగునీరు ఇవ్వాలని 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల ప్రాజెక్టు ను రూపకల్పన చేశారు.ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది. ఈ ప్రాజెక్టు కు నిధులు పూసే ఎత్తకపోవడం ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది.ఈ ప్రకారమైతే జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. నీతి అయోగ్ చేయించిన సోషల్ ఎకనామిక్ సర్వేలో పేదరికంలో రాష్ట్రంలో అట్టడుగున ఉన్న జిల్లాగా ఉమ్మడి కర్నూలు జిల్లా నమోదు కావడం.చాలా ప్రమాదకరంగా కనపడుతుంది.ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో చర్చించి సవరణలు చేసి జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు వేదవతి గుండ్రేవుల రిజర్వాయర్ ఆర్డీఎస్ కుడి కాలువ లకు భారీగా నిధులు కేటాయింపులు చేయాలని కోరుతూఈ కార్యక్రమంలో రైతులు ఏఐటీయూసీ తాలూకా ఉపాధ్యక్షులు రంగన్న కార్యకర్తలు వెంకన్న సలాం సాబ్  హీనహిత్ మల్లయ్య రాము తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *