PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గంగానదిలో సమాధుల కలకలం

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఉత్తర ప్రదేశ్​లో మరొకటి వెలుగు చూసింది. ప్రయాగ్​రాజ్​లోని దేవరఖ్​ ఘాట్​ వద్ద భారీ సంఖ్యలో సమాధులు కనిపించాయి. కన్నౌజ్​ జిల్లాలో మహాదేవి ఘాట్​ వద్ద మృతదేహాలు నీటిలో కొట్టుకురావడం కనిపించింది. ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో గంగానది తీరాన దేవరఖ్​ ఘాట్​ వద్ద భారీ సంఖ్యలో మృతదేహాలను పాతిపెట్టిన ఘటన వెలుగుచూసింది. అయితే.. ఇవి కొవిడ్​తో మృతి చెందిన వారివా? కాదా? అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ సమాధులపై కాషాయ వస్త్రం కప్పి ఉండటం గమనార్హం. కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుండగా.. మృతదేహాల అంత్యక్రియల నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా పెరిగింది. దీంతో ఆర్థిక స్తోమతలేని వారు.. తమ బంధువుల మృతదేహాలను ఇలా గంగానది ఒడ్డున ఖననం చేసి వెళ్తున్నట్లు తెలుస్తోంది. కొట్టుకొస్తూనే ఉన్న మృతదేహాలు..మరోవైపు.. ఉత్తర్​ప్రదేశ్​లోని గంగానదిలో మృతదేహాలు కొట్టుకువస్తున్న ఘటనలు కొనసాగతూనే ఉన్నాయి. తాజాగా.. కన్నౌజ్​ జిల్లాలోని మహాదేవి ఘాట్​ వద్ద 50 మృతదేహాలు తేలియాడుతూ కనిపించటం కలకలం రేపింది. భారీ వర్షాల కారణంగా మృతదేహాలు నది ఒడ్డుకు వచ్చి చేరాయి.
విచారణకు.. కమిటీ : నెలరోజుల వ్యవధిలోనే మహాదేవి గంగా ఘాట్​ వద్ద దాదాపు 2,000 మంది అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. ఈ మృతదేహాల విషయం వార్తల్లోకి రావడం వల్ల అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు కన్నౌజ్​ జిల్లా అదనపు మేజిస్ట్రేట్​ గజేంద్ర సింగ్​.. ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దహనంకన్నౌజ్​ జిల్లా కంటే ముందు.. ఉత్తర్​ప్రదేశ్​లోని గాజీపుర్​, ఉన్నావ్​, చందౌలీ, కాన్పుర్​, వారణాసి సహా ఇతర జిల్లాల్లో గంగానదిలో మృతదేహాలు లభ్యమయ్యాయి.

About Author