సోషల్ మీడియాలో బాలసదనంపై వస్తున్న ప్రచారాలు అవాస్తవం..
1 min read
– అనునిత్యం సీసీ కెమెరాల పరిరక్షణ ఉంటుంది..
ప్రభుత్వ సంస్థలపై దుష్ప్రచారాలు సరికాదు..బాలల సంరక్షణ కేంద్రం, బాలాసదనం సూపరిoడెంట్ బేబీ సరోజినీ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దెందులూరు బాలసదనంపై సోషల్ మీడియాలో కొంత మంది అసత్య ప్రచారం చేస్తున్నారని అది అవాస్తమని దెందులూరు బాలికల సంరక్షణ కేంద్రం బాలసదనం సూపరిo డెంట్ బేబీ సరోజినీ అన్నారు. ఆదివారం దెందులూరు లోని బాలికల సంరక్షణ కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలసదనం సూపరిoడెంట్ బేబీ సరోజినీ మాట్లాడుతూ బాలసదనంలో ఇద్దరు బాలికలు గోడదుకి పారిపోయారని, పారిపోయింది కాక బాలసదనంపై అసత్య ప్రచారాలు చేస్తూ భోజనం సక్రంగా పెట్టడం లేదని బట్టలు ఉతికిస్తున్నారని కొడుతున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. బాలసదనం మొత్తం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉందని ఆ ఇద్దరు బాలికలతో బట్టలు ఉతికించినట్లుగానే పనులు చేయించినట్లుగానే కొట్టినట్లు గాని సీసీ ఫుటేజీలో ఉంటే చట్టపర చర్యలన్నిటికి సిద్ధమని. ఆమె సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని గోడ దూకి పారిపోయే అవకాశమే లేదని సన్నివేశాలను మీడియాకు బేబీ సరోజిని చూపించారు. ఎవరికైనా ఎలాంటి సందేహం ఉన్నా బాలసదనం కోస్తే సీసీ కెమెరా ఫుటేజ్ లో ఇద్దరు పారిపోయినప్పుడు ఏ విధంగా ఉన్నారో స్పష్టంగా తెలుస్తుందని ఇలాంటి అసత్య ప్రచారాలు ప్రభుత్వ సంస్థల మీద మానుకోవాలని బేబి సరోజిని కోరారు.