జనం పైకి దూసుకెళ్లిన కారు.. ఎమ్మెల్యేను చితకబాదిన జనం !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఒడిశాలో ఘోరం జరిగింది. శనివారం బీజూ జనతాదళ్ పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు ప్రజలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. బ్లాక్ చైర్‌పర్సన్ ఎన్నిక జరుగుతుండగా బీడీఓ బాణాపూర్ కార్యాలయం వెలుపల ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కారు అక్కడ గుంపుగా ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 22 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు.దీంతో ఆగ్రహించిన ప్రజలు ఎమ్మెల్యేపై తిరగబడి చితకబాదడంతో పాటు ఆయన కారు కూడా ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.