NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ద‌ర్శక‌ర‌త్న దాస‌రి కొడుకుల పై కేసు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ద‌ర్శక‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు కుమారుల‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. అప్పు తీర్చమ‌న్నందుకు భ‌యపెట్టి.. చంపేస్తామ‌ని బెదిరించినందుకు పోలీసులు కేసు పెట్టారు. గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమ‌శేఖ‌ర్ రావు ఎల్లారెడ్డి గూడ‌లో నివ‌సిస్తారు. దాస‌రి ఆర్థిక ప‌రిస్థితి బాగోలేన‌ప్పుడు సోమ‌శేఖ‌ర్ రావు 2.10 కోట్ల అప్పు దాస‌రికి ఇచ్చారు. ఆయ‌న మ‌ర‌ణాంత‌రం 2.10 కోట్ల అప్పుకుగాను.. 1.5 కోట్ల అప్పు చెల్లించేందుకు దాస‌రి నారాయ‌ణ‌రావు కుమారులు ప్రభు, అరుణ్ ఒప్పుకున్నారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబ‌ర్ 46లోని దాస‌రి నివాసానికి వెళ్లి అప్పు తీర్చమ‌ని అడిగినందుకు .. దాస‌రి కుమారులు అరుణ్, ప్రభు సోమ‌శేఖ‌ర‌రావును బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

About Author