కేంద్రం కీలక నిర్ణయం.. ఆ చట్టం నుంచి మినహాయింపు !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం పరిధి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోని 36 జిల్లాలను మినహాయిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని 23 జిల్లాలు, మరో జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, మణిపూర్‌లోని 6 జిల్లాలు, నాగాలాండ్‌లోని 7 జిల్లాలకు ఈ మినహాయింపు లభించింది. ఈ చట్టం 1958 సెప్టెంబరు 11 నుంచి అమల్లోకి వచ్చింది. ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడటం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అవసరమని భావించిన చర్యలను సాయుధ దళాలు అమలు చేయడానికి ఈ చట్టం అనుమతి ఇస్తుంది. తీవ్రవాదుల శిక్షణ స్థావరాలను ధ్వంసం చేయడం, వ్యక్తుల మరణానికి దారి తీసే విధంగానైనా చర్యలు చేపట్టడం, వారంట్ లేకుండా వ్యక్తులను అరెస్టు చేయడం వంటివాటికి అవకాశం కల్పిస్తుంది.