ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించిన కేంద్ర ప్రభుత్వం
1 min readపల్లెవెలుగువెబ్ : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈ నెల 17న కేంద్ర హోంశాఖ భేటీకానుంది. ప్రత్యేక హోదా అంశాన్ని అజెండా నుంచి కేంద్రం తొలగించింది. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అంశాలను తొలగిస్తూ లేఖ రాసింది. విభజన కమిటీ అజెండాలో ఏపీ ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు లేదని తెలిపింది. మొదట ఇచ్చిన సర్క్యులర్‌లో ఎనిమిదో అంశంగా ప్రత్యేక హోదా ఉంది. హోదా అంశాన్ని తొలగిస్తూ కేంద్రం మరో సర్క్యులర్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కేంద్ర హోంశాఖ కమిటీ ఏర్పాటు చేయనుంది. ఎజెండాలో సవరణలు చేస్తూ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.