NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మార్పు మొదలైంది..!

1 min read

వైకాపా దుష్టపాలనకు అంతిమ ఘడియలు

అధికారంలోకి వచ్చేది బీజేపీ టీడీపీ  జనసేన కూటమి

అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం

అల్లూరు లో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  రాష్ట్రంలో మార్పు మొదలైంది.వైసీపీ దుష్ట పాలనకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య అన్నారు. సోమవారం  టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులతో  కలిసి అల్లూరు గ్రామంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైకాపా ప్రభుత్వం అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. బీజేపీ ` టీడీపీ  జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయబోయే సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం గిత్త జయసూర్య  మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ రావడంతో దుష్టపాలనకు అంతిమ ఘటియలు ప్రారంభమయ్యాయన్నారు. అధికార పార్టీ దుర్మార్గాలు దౌర్జన్యాలకు ప్రలోభాలకు తెరపడిరదన్నారు. ఈ ఐదేళ్ల జగన్‌ పాలనలో ప్రజలు ఎన్నెన్నో కష్టాలు బాధలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రానున్నవన్నీ మంచి రోజులేనని, బిజెపి టిడిపి జనసేన కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, చంద్రన్న పాలనలో ప్రజలు సుఖంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించవచ్చన్నారు.బిజెపి  టిడిపి  జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే  అభివృద్ధి అంటే ఏమిటో అభివృద్ధి పనులు శాశ్వతంగా ఎలా ఉంటాయో చూపిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను తాము నెరవేరుస్తామన్నారు. తాము చెప్పిందే చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో   మాండ్ర రత్నాకర్ రెడ్డి, సున్నంపల్లి వెంకయేశ్వర్లు,మాండ్ర పురుషోత్తం రెడ్డి,కురువ చిన్ననాగలక్ష్మయ్య,కురువ పెద్దరాజు, కురువ చిన్నరాజు, కరువ వెంకటేశ్వర్లు, మాబాష,మావలి,మహాబూబ్ బాష,హసీన్ బాష,రఫీ,గిత్త గాంధీ, గిత్త ప్రతాప్,మాజీ ఎంపీటీసీ నాగేంద్ర,దాసరి శ్రీరాములు,బిజ్జారపు ప్రకాశం,ఆలేటి నాగేశ్వరరావు, సుబ్బన్న,అడ్డాకుల వెంకటేశ్వర్లు,దాసరి మద్దిలేటి,గిత్త నాగరాజు,గొల్ల సాంబశివుడు,తిరుపతయ్య, బాలకృష్ణ,బాలరాజు,మహేష్,కురుమన్న,బాలస్వామి ,రామచంద్రుడు, ముస్లిం, ఎస్సీ, బీసీ  యువకులు, నాయకులు,కార్యకర్తలు   పాల్గొన్నారు.

About Author