మల్లన్నను దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
1 min readపల్లెవెలుగు వెబ్: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు ఆదివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహా మంగళహారతి దర్శనానికి విచ్చేసిన ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులకు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, దేవస్థాన ఈఓలవన్నలు రాజగోపురం వద్ద మంగళవాయిద్యాలతో అర్చక స్వాములు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు రత్నగర్భ గణపతి పూజ, మహా మంగళ హారతి సేవా, స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకొని స్వామి, అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులకు వేద పండితులు వేద మంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులకు స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించి సత్కరించారు. ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారి వెంట ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపా సాగర్, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ అడ్మిన్ డి వెంకటరమణ, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ లక్ష్మణ రావు, జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి లవన్న, ఆత్మకూరు డిఎస్పీ శృతి తదితరులున్నారు.