PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ఎంపీపీ చీర్లకు హామి

1 min read

– జాతీయ రహదారి విస్తరణ పెండింగ్ పనులను పూర్తిచేయాలని సీఎంకి వినతి

 – ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేసిన ఎంపీపీ చీర్ల

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కడప- కర్నూల్ జాతీయ రహదారి(40) విస్తరణలో భాగంగా చెన్నూరు కొత్త రోడ్డు పైన అసంపూర్తిగా ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని గురువారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి వినతి పత్రం అందజేసినట్లు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ తెలిపారు, గురువారం చరవాణి ద్వారా ఆయన పల్లెవెలుగు విలేకరి తో  మాట్లాడుతూ, తమ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినిఆహ్వానించినట్లు ఆయన తెలిపారు, అలాగే కమలాపురం శాసనసభ్యులు పోచమ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు చెన్నూరు లో అసంపూర్తిగా ఉన్న పనుల పై ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు, ఇందులో ముఖ్యంగా చెన్నూరు కడప కర్నూలు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కొత్త రోడ్డు ఇరువైపులా ఇండ్లు ఇండ్ల స్థలాలు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు, అలాగే చెన్నూరు కొత్త రోడ్డు నుండి పెన్నా నది వరకు 650 మీటర్లు డ్రైనేజీ పనులు, అలాగే సర్వీస్ రోడ్డు పనులు, బస్ షెల్టర్ కోరడం జరిగిందని ఆయన తెలిపారు, మండలం లోని శివాలపల్లె వద్దనుండి, ఓబులంపల్లె వరకు కేసీ కెనాల్ సైడ్ వాల్ దెబ్బతిన్నడంతోపాటు, కె సి కెనాల్ లో వ్యర్థాలు వేయడం వల్ల దుర్వాసన వేద జల్లు తున్నదని, సైడ్ వాల్ తో పాటు, చెన్నూరు సరస్వతి నగర్ వద్ద నుండి, అరుంధతి నగర్ వరకు కంచ వేయాలని తెలిపినట్లు ఆయన తెలిపారు, అలాగే మండలంలోని బయనపల్లి, కనపర్తి, బలసింగాయ పల్లి, దౌలాతాపురం, ఎస్టీ రామాపురం పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పీహెచ్ సీని కనపర్తి లేఅవుట్లో మంజూరు చేయాలని కోరినట్లు ఆయన తెలియజేశారు, అలాగే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ మూత పడడం జరిగిందని మండలానికి ఉన్న ఒకే ఒక కర్మాగారం మూతపడడంతో అటు చెరకు రైతులకు, ఇటు కార్మికులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఆ కర్మగారంలో ఏదైనా పరిశ్రమలు తీసుకొచ్చి మండల ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు, అంతేకాకుండా చెన్నూరు పెన్నా నది సైడ్ వాల్( ఆనకట్టలు) దెబ్బతిన్నాయని వాటి నిర్మాణాన్ని చేపట్టాల్సిందిగా ఆయన చెన్నూరు సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రికి వివరించినట్లు ఎంపీపీ తెలిపారు, సావధానంగా సమస్యలు విన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన కు హామీ ఇవ్వడమే కాకుండా తాను ఇచ్చిన మెమొరండాన్ని అక్కడే ఉన్న ఓఎస్డీకి ఇచ్చి కడప జిల్లా కలెక్టర్ కు పంపించాల్సిందిగా తెలపడం జరిగిందని ఎంపీపీ తెలిపారు. తన వెంట తన కుమారుడు చీర్ల శేషు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

About Author