ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కృష్ణగిరి మండలం ఆలంకొండ వద్ద రూ.253.72 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్,రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు,కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి,కర్నూలు నగర మేయర్ బివై.రామయ్య, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా కర్నూలు – నంద్యాల జిల్లాల పశ్చిమ ప్రాంత 77 చెరువులకు హంద్రీ – నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుండి 10363 ఎకరాల ఆయకట్టు సాగు కానుంది.డోన్ నియోజకవర్గానికి సంబంధించి,డోన్ మండలం లో 17 చెరువులకు గాను 2464.50 ఎకరాల ఆయకట్టు,ప్యాపిలి మండలం లో 19 చెరువులకు 1796.80 ఎకరాల ఆయకట్టు, పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి, కృష్ణగిరి మండలంలో 4 చెరువులకు 1472.07 ఎకరాల ఆయకట్టు, వెల్దుర్తి మండలంలో 13 చెరువులకు 2001.8 ఎకరాల ఆయకట్టు,పత్తికొండ మండలంలో 3 చెరువులకు 212.60 ఎకరాల ఆయకట్టు,తుగ్గలి మండలంలో 14 చెరువులకు 1386.62 ఎకరాల ఆయకట్టు, మద్దికెర మండలంలో 2 చెరువులకు 699.50 ఎకరాల ఆయకట్టు సాగు కానుంది..అలాగే ఆలూరు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి,దేవనకొండ మండలమ్లో 3 చెరువులకు 171.5 ఎకరాల ఆయకట్టు, పాణ్యం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి, కల్లూరు మండలం లో 2 చెరువులకు 157.60 ఎకరాల ఆయకట్టు సాగు మొత్తం 10363 ఎకరాల ఆయకట్టు సాగు కానుంది.ముందుగా పంప్ హౌస్ ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన కర్నూలు – నంద్యాల జిల్లాల పశ్చిమ ప్రాంత 77 చెరువులకు హంద్రీ – నీవా సుజల స్రవంతి కాలువ నుండి సాగు, త్రాగు నీరు అందించు పథకానికి సంబంధించిన పైలాన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అక్కడే ప్రాజెక్ట్ కి సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, మ్యాప్ ను పరిశీలించారు.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఏ మండలాలకు నీరు ఎలా సరఫరా అవుతుందనే విషయాలను, పంపింగ్ కెపాసిటీతో పాటు ఇతర వివరాలను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్ ముఖ్యమంత్రికి వివరించారు.అనంతరం నీటిని విడుదలకు సంబంధించిన ప్యానెల్ బోర్డ్ ను స్విచ్ఛాన్ చేశారు.ఈ సందర్భంగా నీటి వివరాలను జలవనరుల శాఖ ఇంజనీర్ – ఇన్ – చీఫ్ సి .నారాయణ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ రెడ్డి శేఖర్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు..ప్రజలకు, అభిమానులకు నవ్వుతూ, నమస్కారం చేస్తూముందుగా కృష్ణగిరి మండలం ఆలంకొండ హెలిప్యాడ్ వద్దకు ఉదయం 10.45 గంటలకు చేరుకొని రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10.56 గంటలకు ఆలంకొండ పంప్ హౌస్ వేదిక స్థలానికి ముఖ్యమంత్రి చేరుకోగానే పత్తికొండ నియోజకవర్గ చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు ముఖ్యమంత్రిని చూడగానే ఉత్సాహంతో నినాదాలు చేశారు.. తనను చూడడానికి వచ్చిన ప్రజలకు, అభిమానులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నవ్వుతూ నమస్కరించారు. కార్యక్రమం అనంతరం కూడా మరోసారి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు.. అనంతరం డోన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు.