PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బేడ బుడగ జంగం కులానికి సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చాలి

1 min read

– తూర్పాటి మనోహర్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ యు కెన్ ప్లాజా ప్రెస్ క్లబ్ లో తూర్పాటి మనోహర్ మాట్లాడుతూ:- తేదీ:- 6-7-2022. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నందు జగనన్న విద్యా దీవెన బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వాల్మీకి( బోయ) మరియు బేడ బుడగ జంగం కులమునకు న్యాయం జరిగే విధంగా కేంద్రానికి నివేదిక పంపే విధంగా చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. కానీ వాల్మీకులకు, మాదాసి మదారి కురువ, నక్కల, దళిత క్రిస్టియన్స్, మున్నూరు కాపు, వంటి కులాలకు న్యాయం చేస్తూ, బేడ బుడగ జంగం కులమునకు న్యాయం చేయకపోవడం బాధాకరమైన విషయం. కానీ వాల్మీకుల గురించి ఏర్పాటు చేసిన జీవో నెంబర్ 52 ప్రకారం 5 నెలలోనే కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపుతున్నారు. కానీ బేడ బుడగ జంగం కులంపై జీవో నెంబర్ 96, 104 ప్రకారం 2 సంవత్సరాల రెండు నెలల 18 రోజులు తమ రిపోర్టును రెండు దఫాలుగా ఇచ్చిన వాటికి న్యాయం చేయకపోవడం ఆంతర్యం ఏమిటి? అనగా జన, రాజకీయ, ఉద్యోగరీత్యా, ఉన్న కులాలకే నా న్యాయం చేసేది, మాలాంటి సంచార కులాలకు న్యాయం జరగదా! ఆవేదనతో కుమిలిపోవాల్సిన స్థితి ఏర్పడినది. ఇదేనా పాలకుల వ్యవస్థ, ప్రభుత్వాలు మారుతున్న మా తలరాతలు మారవా! డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తూ, న్యాయం చేసేది ఇదేనా! కనుక నేటికైనా అన్ని విధాలుగా జీవోలు చట్టాలు కమిషన్ రిపోర్ట్స్ గౌరవం ముఖ్యమంత్రి హామీ మేరకు మాకు న్యాయం చేయాలి. లేనిచో మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మే 2న భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నామని తెలిపారు. తూర్పాటి మనోహర్ ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు, కొండపల్లి గోకారి ఉపాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు సిరిగిరి జమ్మన్న, సిరివాటి రంగస్వామి, b. మద్దిలేటి, కళ్యాణం మారెప్ప, దూపం చిన్న రాముడు, డీకే రంగస్వామి,b. పెద్ద చింతలయ్య మొదలగువారు పాల్గొన్నారు.

About Author