సామాన్యులు చైతన్యం అయితే మార్పు తద్యం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇచ్చి, ఎన్నికల తర్వాత హామీల గురించి ఆలోచించకుండా, ప్రజల కనీస అవసరాలు తీర్చకుండా ఐదేళ్లపాటు స్వలాభం కోసం, వ్యాపారాల కోసం పనిచేసే నాయకులను రాజకీయాలకు శాశ్వతంగా దూరం చేయాలంటే సామాన్యుల చైతన్యం ఎంతో అవసరమని, ఓటు అవగాహన వచ్చిన రోజు, ప్రజాసేవ పేరుతో దోచుకునే వారికి తగిన గుణపాఠం చెప్పొచ్చని జాతీయ సమ సమాజం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ కప్పల నగర్ లో జరిగిన జయహో ప్రజా పలకరింపు యాత్ర లో పాల్గొన్న ఆ ప్రాంత ప్రజలను ఉద్దేశించి అన్నారు.