NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌మిష‌న‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించిన స‌ర్పంచ్ల సంఘం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ స‌ర్పంచ్ ల సంఘం తాడేపల్లిలోని పంచాయ‌తీరాజ్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించింది. నిధులు మంజూరు చేయకుండా దారి మళ్లిస్తున్నారంటూ తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు ముట్టడించారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో అసిస్టెంట్ కమిషనర్‌ను గదిలోపెట్టి నిర్బంధించారు. పంచాయతీలకు రావాల్సిన రూ. 7వేల కోట్ల నిధులను దారి మళ్లించారని సర్పంచ్‌ల ప్రతినిధులు మండిపడ్డారు. సర్పంచ్‌లకు చెప్పకుండా వారి ఖాతాల నుంచి నిధులు ఎలా మళ్లిస్తారంటూ.. అక్కడే ధర్నాకు దిగారు. సర్పంచ్‌లకు సంబంధించిన నిధులు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, కేంద్రం విడుదల చేసిన నిధులు కూడా ఇతర పథకాలకు మళ్లించడంతో గ్రామాలు అభివృద్ధి చేయలేకపోతున్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళ‌న చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.

                                  

About Author