దోమలను సిద్ధం చేస్తున్న కంపెనీ.. త్వరలో జనం పైకి !
1 min readపల్లెవెలుగువెబ్ : దోమల బెడద తప్పించేందుకు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది ఆక్సీటెక్ కంపెనీ. జన్యుమార్పిడి సాంకేతికత సాయంతో ఆక్సిటెక్ సిద్ధం చేసిన ఈ మగ దోమల్లో ఓ ప్రత్యేక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కారణంగా అవి కేవలం మగ దోమలకు మాత్రమే జన్మనివ్వగలవు. ఇవి.. సంతానోత్పత్తి కోసం సాధారణ మగ దోమలతో పోటీ పడుతూ ఆడ దోమలతో కలుస్తాయి. ఫలితంగా.. తరువాత తరంలో ఆడ దోమల కంటే మగ దోమల సంఖ్య పెరుగుతుంది. కొంత కాలం తరువాత.. ఆడ దోమల సంఖ్య భారీగా పడిపోయి చివరికి దోమలు ఆ ప్రాంతం నుంచి కనుమరుగైపోతాయి. జీకా, చికున్‌గున్యా, యెల్లో ఫీవర్ వంటి వ్యాధులకు కారణమయ్యే ఏడిస్ ఈజిప్టీ దోమలను అంతం చేసేందుకు ఆక్సీటెక్ ఈ ప్రాజెక్టు చేపట్టింది.