గుజరాత్ అల్లర్ల కుట్ర వారిదే !
1 min readపల్లెవెలుగువెబ్ : 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ఇరికేంచేందుకు దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్ర పన్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు సిట్ వెల్లడించింది. ఈ కుట్రలో సామాజిక కార్యకర్త తీస్వా సెతల్వాద్‌కు హ్యాండ్ ఉందని సిట్ పేర్కొంది. ఈ మేరకు సెషన్స్ కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అయితే, 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి కల్పిత సాక్ష్యాలు, తప్పుడు సమాచారం ఆరోపణలపై పోలీసు శాఖకు చెందిన సిట్ దర్యాప్తు జరుపుతోంది. విచారణలో భాగంగా.. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్, ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్‌లకు అహ్మద్ పటేల్ 30 లక్షలు ఇచ్చారని సిట్ తెలిపింది. అలాగే, అల్లర్ల కేసులో మోదీని ఇరికించాలానే ఉద్దేశంతో పటేల్ ఆ డబ్బులు ఇచ్చినట్లు సిట్ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. సెతల్వాద్, శ్రీకుమార్‌లు నేర కుట్రకు, ఫోర్జరీకి పాల్పడినట్లు సిట్ వెల్లడించింది.