అసంపూర్తిగా నిలిచిన వంతెన నిర్మాణం వెంటనే చేపట్టాలి
1 min read– జమీల్ అహ్మద్ బేగ్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం గ్రామంయనమలకుదురు లాకుల వద్ద వంతెన శిథిలావస్థకు రావడంతో బందర్ రోడ్డు కరకట్ట రోడ్డు మీదుగా రావలసిన 7ఆర్ 7వై ఆర్ టి సి బస్సులు సర్వీసులు నిలిపివేశారని, 2011 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బందర్ కాల్వ పై 2011 జూన్26 శంకుస్థాపన జరిగిందని అనంతరం కొంతమేర వంతెన పనులు జరిగాయనిఏ కారణం చేతనో అసంపూర్తిగా పనులు నిలిచిపోయాయని, యనమలకు దురులాకులనుంచి బందర్ రోడ్డులో ప్రజలు రావాలంటేపూర్తిగా నిలిచిన వంతెననిర్మాణం వెంటనే చేపట్టాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీమైనార్టీ విభాగం నేషనల్ వైస్ చైర్మన్ జమీల్ అహ్మద్ బేగ్ ప్రకటనలో తెలియజేశారు.12 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా సదరు వంతెన పనులుఅసంపూర్ణంగా ఆగిపోవడంతో చిన్న వంతెన మీదుగా రాకపోకలు ఉండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, ప్రభుత్వ చొరవ తీసుకుని పోలీసు వారిని ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య కొంతమేర తొలగిందని ,ఈ వంతెనమీదుగా విద్యార్థులు కార్మికులు, పాఠశాలకు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, బస్సు సౌకర్యం లేక పోవడంతో పాటు ,ఈ చిన్న వంతెన పైనుంచి వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని ,దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది అని ఉదయం 7గంటల నుంచి 10 గంటలు వరకు సాయంత్రం 5గంటల నుంచి 6గంటల వరకు ఈ ప్రాంతం వంతెనదాటాలంటే ప్రాణ సంకటం గా ఉంటుందని ఆసియాలోనే అతిపెద్ద ఆటోనగర్ కార్మికులు ఎంతోమంది వెళ్లి వస్తుంటారు నగరానికి అతి దగ్గరలో ఉన్నా బస్సు సౌకర్యం లేకపోవడం తో ఆసుపత్రులకు వెళ్లేవారు,దినచర్య పనులకు వెళ్లాలన్న సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అసంపూర్ణమైన వంతెన నిర్మాణం పై దృష్టి సారించి ఈ ప్రాంత ప్రజల పరిస్థితులు పరిష్కారం చూపగలరని నేషనల్ కాంగ్రెస్ మైనార్టీ విభాగం తరపున వైస్ చైర్మన్ జమీల్ అహ్మ ద్ బేగ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించడం జరిగిందని ఒక ప్రకటనలో తెలియజేశారు.