NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే..

1 min read

– జూలై 8 వైఎస్సార్​ జయంతిన 200 ఆర్​బీకేలు ప్రారంభించాలి
– జూమ్ ​వీసీలో అధికారులను ఆదేశించిన జేసీ (ఆసరా &సంక్షేమం) శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ భవనాలు, పాల శీతలీకరణ కేంద్రాలు తదితర భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లకు జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్, పంచాయతీరాజ్ ఎస్ ఈ, డిపిఓ, ఎంపీడీఓలు, ఏ పీ ఓ లు, ఈఈలు, ఏఈలతో జేసీ శ్రీనివాసులు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ తదితర భవన నిర్మాణ పనులను వేగవంతం చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం పక్షోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తుందని జిల్లాలోని అన్ని భవన నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. దివంగత నేత డా. వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి జయంతి జూలై 8న 200 ఆర్​బీకేలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ అమర్నాథ్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ ఈ సుబ్రమణ్యం, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ప్రభాకర్ రావ్, ఎంపీడీవోలు, ఏ పీ ఓ లు, ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

About Author