PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పగిడ్యాల,నందికొట్కూరు,పాములపాడు మండలాల ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం చేపట్టిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును అధికారులు ఉదయం 8 .15 లకు ప్రారంభించారు. మొదట ఆయా గ్రామాల లోని పోలింగ్ కేంద్రాల లో వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆనంతరం ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంబించి మధ్యాహ్నం 12 గంటల లోపు ఫలితాలను అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం నుంచి జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించి ఫలితాలు వెల్లడించారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, శాప్ ఎం డి డా. ప్రభాకర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) మనజిర్ జిలానీ సామొన్ లు పరిశిలించారు.ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద చేపట్టిన ఏర్పాట్లను, బందోబస్తును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వెంట శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, సెట్కుర్ సీఈఓ నాగరాజ నాయుడు వున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద చేపట్టిన పోలీసు బందోబస్తును ఆత్మకూరు డిఎస్పీ శృతి పరిశీలించారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ నాగరాజ రావు, అధ్వర్యంలో ఎస్ఐ లు వెంకట రెడ్డి, మారుతి శంకర్, ఓబులేసు, శ్రీనివాసులు, తమ సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు.

About Author