దేశమంటే మట్టి అనే రీతిలో ప్రభుత్వ వ్యవహారం !
1 min read
పల్లెవెలుగువెబ్ : జగన్ మూడేళ్ల పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని, అన్ని రకాల ఛార్జీల రేట్లు కూడా పెంచేశారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. ‘దేశమంటే మనుషులు కాదోయ్.. దేశమంటే మట్టొయ్’ అనే రీతిలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. ఐటీ రంగం ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. టీడీపీని అధికారంలోకి తెస్తేనే ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు ఉంటుందని… టీడీపీకి ప్రజాశీస్సులు ఇవ్వాలని కోరారు.