దేశం సరిగా నిద్రపోవడం లేదట !
1 min read
పల్లెవెలుగువెబ్ : దేశ నగర జనాభాలో సగం మంది సరైన నిద్రపోవడం లేదు. నిద్రలేమి తెచ్చే ఆరోగ్య సమస్యలపై నగర వాసుల్లో అవగాహన ఉన్నా… అప్రమత్తత మాత్రం కొరవడింది. రెస్‌మెడ్ సంస్థ తాజా సర్వే కోసం మన నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో వేలాది మందిని ప్రశ్నించిన ఈ సర్వేలో ఇలాంటి పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కరోనా నేపధ్యంలో గత రెండేళ్లలో నిద్రలేమి స్థాయిలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. మన దేశంలో నిద్ర నాణ్యత లేమి అనుభవిస్తున్న వ్యక్తులలో 57% పెరుగుదల నమోదైంది. ఈ పరిస్థితికి మహమ్మారితో పాటు వచ్చిపడిన వృత్తిపరమైన ఆందోళన ప్రధాన కారణం. సర్వేలో పాల్గొన్న వారిలో 81 శాతం మంది నిద్రిందచే శైలి తమ జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుందని అంగీకరించారు.. అలాగే 72 శాతం మంది సరిగా నిద్ర వేళలు పాటించకపోవడమే తమ పేలవమైన మానసిక పరిస్థితికి కారణమని చెప్పారు. నిద్రకు ఉపక్రమించిన తర్వాత నిద్రపోవడానికి సగటున సుమారు 90 నిమిషాలు తీసుకుంటున్నామన్నారు.