బైరెడ్డి కేసును కొట్టివేసిన కోర్ట్..
1 min readసాయి ఈశ్వరుడు హత్య కేసు పదేళ్ల తర్వాత తీర్పు
వైసీపీ నాయకుల సంబరాలు
న్యాయం గెలిచిందన్న బైరెడ్డి..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయి ఈశ్వరుడు హత్య కేసులో శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లపై నమోదైన కేసును కొట్టివేస్తూ బుధవారం విజయవాడ ఫాస్ట్ ట్రాక్ (ఎమ్మెల్యే ఎంపీ) కోర్టు తీర్పు ఇచ్చింది.వివరాల్లోకి వెళ్తే 2014 మార్చిలో కర్నూలులో శకుంతల కళ్యాణ మండపం వెనుక రెవెన్యూ కాలనీలో సాయి ఈశ్వరుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.అప్పట్లో కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి,బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లతో పాటు మరో 9 మంది పై కేసులు నమోదు అయ్యాయి.సాయి ఈశ్వరుడు హత్య కేసు 10 సం.ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసుపై ఎలాంటి సాక్ష్యా దారాలు లేకపోవడంతో కేసు నమోదు అయిన వారందరూ నిర్దోషులుగా ప్రకటిస్తూ విజయవాడ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు ఇచ్చింది.న్యాయం గెలిచిందని కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీడియాతో అన్నారు.కేసును కొట్టివేయడంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభిమానులు మరియు వైసీపీ నాయకులు నందికొట్కూరు పట్టణ వైసీపీ ప్రెసిడెంట్ మన్సూర్ ఆధ్వర్యంలో జబ్బార్, అబూబకర్ పట్టణంలో టపాకాయలు కాలుస్తూ కేక్ కట్ చేశారు.అదేవిధంగా మిడుతూరు మండల కేంద్రం బస్టాండ్ ప్రాంతంలో వైసీపీ నాయకులు టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.