PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెలుగోడులో యువనేత పాదయాత్రలో వెల్లువెత్తిన జనం

1 min read

– నల్లమల అడవుల్లో ఉత్సాహంగా యువగళం పాదయాత్ర

– యువనేతను కలిసిన సేవ్ ద టైగర్ ప్రతినిధులు

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:    యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 99వరోజు శ్రీశైలం నియోజకవర్గంలో వెలుగోడు అటవీ ప్రాంతంలో ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర దారిలో యువనేత వివిధ వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారు. ఆదివారం సాయంత్రం వెలుగోడులో యువనేత పాదయాత్రకు జనం వెల్లువెత్తారు. లోకేష్ ని చూసేందుకు, కలిసి సమస్యలు చెప్పుకునేందుకు భారీగా ప్రజలు రోడ్ల పైకి వచ్చారు.  వెలుగోడు ప్రజలు భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చెప్పారు. లోకేష్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు మహిళలు, రైతులు, యువత, వృద్దులు పోటీపడ్డారు. టిడిపి అధికారంలోకి రాగానే స్థానికంగా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉదయం కొత్తరామాపురం గ్రామస్తులు లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. దాదాపు 5 కి.మీ మేరకు అటవీ ప్రాంతంలో యువనేత పాదయాత్ర కొనసాగించారు.  వెలుగోడు అటవీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో నల్లకాల్వలో దివంగత మాజీముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి లోకేష్ నివాళులర్పించారు. అనంతరం సేవ్ ద టైగర్ క్యాంపెయిన్ ప్రతినిధులు ఇమ్రాన్ సిద్ధిఖీ, సీనియర్ జర్నలిస్టు పులిపాక బాలు యువనేతను మర్యాదపూర్వకంగా కలుసుకుని పులుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అటవీ ప్రాంతంలో పాదయాత్ర సమయంలో తెలుగుగంగ కాల్వను యువనేత సందర్శించారు. అనంతరం వెలుగోడు శివార్లలో ఫారెస్టు కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులతో సమావేశమై వారి సాధకబాధకాలు విన్నారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం వెలుగోడు మీదుగా పాదయాత్ర బోయరేవులకు చేరుకుంది. పాదయాత్ర దారిలో బెస్తలు, బుడగ జంగాలు, ఎస్సీలు, వికలాంగులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. 99వరోజు 16.2 కి.మీ మేర పాదయాత్ర కొనసాగింది. ఇప్పటివరకు యువనేత లోకేష్ 1268.9 కి.మీలు పాదయాత్ర చేశారు.

పాదయాత్ర దారిలో వ్యక్తమైన అభిప్రాయాలు:

ఫరూక్, హోటల్ యజమాని, ముత్తుకూరు : మాది సమీపంలోని ముత్తుకూరు గ్రామం. బి.ఇడి పూర్తిచేశాను. ఉద్యోగం రాక వెలుగోడు చిన్న హోటల్ నడుపుకుంటున్నా. హోటల్ కు రూ.15వేలు అద్దె చెల్లిస్తున్నాం. వ్యాపారం ఏమీ బాగోలేదు. గత ఏడాది రెండులక్షలు నష్టం వచ్చింది. గతంలో 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ప్రస్తుతం 3వేల దాకా వస్తోంది. కరెంటు బిల్లుతోపాటు గ్యాస్, పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు బిల్లులు తగ్గితే మాలాంటి వారు నలుగురికి ఉపాధి చూపగలం.

జగదీష్, సుబ్బయ్య, వేల్పనూరు: వెలుగోడులో ఇంటర్ వరకు చదివాం. ప్రస్తుతం ఇంటివద్దే ఉండి పనులు చేసుకుంటున్నాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. మా ప్రాంతంలో ఏవైనా పరిశ్రమలు ఏర్పాటుచేస్తే మాలాంటి వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

అల్తాఫ్, డ్రైవర్, వెలుగోడు: నాకు నెలకు రూ.15వేలు వస్తాయి. ప్రభుత్వం నుంచి ఏ స్కీములు రావడం లేదు. లారీలకు కిరాయిలు పెద్దగా లేకపోవడంతో… కొన్నాళ్లు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. నాకు ఇల్లు లేదు. గతంలో వచ్చే రంజాన్ తోఫా, దుల్హాన్ వంటి పథకాలేవీ ఇప్పుడు అమలు కావడంలేదు. ఏదైనా చిన్న షాపు పెట్టుకొని స్వయం ఉపాధి పొందుదామంటే ఈ ప్రభుత్వంలో ఎటువంటి రుణాలు రావడంలేదు. టిడిపి ప్రభుత్వం వచ్చాక ఇస్లామిక్ బ్యాంక్ పెడితే మాలాంటి వారికి ఉపయోగకరంగా ఉంటుంది.

About Author