కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని.. హైటెన్షన్ వైర్ ఎక్కి నిరసన !
1 min readపల్లెవెలుగువెబ్ : ఓ పేదవాడికి విద్యుత్ బిల్లు షాక్ గట్టిగా తగిలింది. దీంతో ఆ వ్యక్తి 40కే వోల్టు హైటెన్షన్ వైర్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ ఏర్పడింది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నందకాపూర్వ గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో నివాసం ఉంటున్న ఓ పేద కుటుంబానికి రూ. 7,700 విద్యుత్ బిల్లు వచ్చింది. బిల్లు ఎందుకొచ్చిందో? ఆ బిల్లు ఎలా చెల్లించాలో తెలియక ఆ ఇంటి యజమాని అధికారుల చుట్టు తిరిగాడు. అయినా ఫలితం కనిపించలేదు. అయితే కరెంట్ బిల్లు కట్టలేదని విద్యుత్ అధికారులు అతని ఇంటికి పవర్ కనెక్షన్ తీసేశారు. దీంతో ఆగ్రహించిన ఇంటి యజమాని హైటెన్షన్ వైర్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు.