మొగల్ చక్రవర్తుల పాఠ్యాంశాన్ని పునరుద్ధరించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ గుంటూరు : గుంటూరు లాలాపేటలోని షాహి జామియా మసీదు (పెద్ద మసీదు) ప్రాంతంలో మహబూబ్ సుబాని జెండా చెట్టు వద్ద మంగళవారం జరిగిన కార్యక్రమంలో మొగల్ చక్రవర్తుల పాలన పాఠ్యాంశాన్ని తరగతి పుస్తకం నుంచి తొలగించడం అన్యాయమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్ వైస్ చ్కెర్మన్ జమీల్ అహ్మద్ బేగ్ అన్నారు. మొగల్ చక్రవర్తుల భారత దేశాన్ని 1526 నుంచి 1707 వరకు పాలించారు. వీరిలో బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు వంటి వారు భారత దేశాన్ని పాలించారు. వారి కాలంలో దేశం సుభిక్షంగాను, సుఖసంతోషాలతో జీవించారని, వారి కాలంలో ఎన్నో చారిత్రక కట్టడాలను నిర్మించారన్నారు. ఆ కోవలోవే ఆగ్రా కోట, తాజ్‌మహల్, ఎర్రకోట వంటి చారిక్రత కట్టడాలను నేటికీ మనం చూస్తున్నాం. దేశ ప్రధాని ఎర్రకోటపై దేశ జెండాను ఎగురవేయడం గర్వకారణంగా భావిస్తున్నాం. భావితరాలకు వారియొక్క చరిత్ర గుర్తుండాల్సిన అవసరం ఎంత్కెనా ఉంది. వారు నిర్మించిన చారిత్రక కట్టడాలను పదిలపరచుకుంటున్నాం గాని తొలగించం.. అటువంటిది కేంద్ర ప్రభుత్వం మొగలుల చరిత్ర పాఠ్యాంశాన్ని తొలగించడం అన్యాయమని, రాష్ట్రంలోని పాలకపక్షంతోపాటు ప్రతిపక్ష పార్టీలు సైతం పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై చర్చ లేవనెత్తి మైనార్టీలకు న్యాయం జరిగేలా పోరాడాలని జమీల్ అహ్మద్ బేగ్ కోరారు. ఆయన వెంట షఫీ బేగ్, రఫీ బేగ్, రియాజ్ బేగ్, హాజీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.