NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బద్వేల్​ అభ్యర్థిపై జనసేన​తో చర్చించాకే నిర్ణయం..సోమువీర్రాజు

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: కడప జిల్లా బద్వేల్​ అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 30న ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక విషయంలో జనసేనతో చర్చించాకే ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు. బుధవారం ఆయన అమరావతిలో విలేకర్లతో మాట్లాడారు. జనసేన మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలిపారు. ఈమేరకు త్వరలో జనసేన అధినేత పవన్​కళ్యాణ్​తో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఇరుపార్టీల మధ్య కుదిరే సయోధ్య ద్వారా ఎవరిని పోటీలో నిలపాలన్న అంశాన్ని ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో రహదారుల దుస్థితి మరిఅధ్వానంగా ఉందని, రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేనతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

About Author