డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరం
1 min readపల్లెవెలుగువెబ్ : భారత్‌లో సెకండ్ వేవ్‌కు కారణమైన కరోనాలోని డెల్టా వేరియంట్ ఎంతోమంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. తాజాగా, ఈ వేరియంట్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) నిర్వహించిన అధ్యయనంలో మరో ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్‌లోని అన్ని వేరియంట్ల కంటే డెల్టా అత్యంత ప్రమాదకరమైనదని ఈ అధ్యయనంలో గుర్తించారు. సార్క్- కోవ్- 2 వైరస్ సోకిన వ్యక్తులు ఒక్కో వేరియంట్‌కు ఒక్కోలా స్పందిస్తారా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు సీసీఎంబీ ఈ అధ్యయనం చేసింది.