PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టాటూలా ఉండాల‌నే మెడ పై కొరికార‌ట !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ అమ్నేషియా ప‌బ్ కేసులో బాధితురాలి మెడికల్‌ రిపోర్టు కీలకంగా మారనుంది. ఈ మెడికల్‌ రిపోర్టు ప్రకారం లైంగిక దాడి సమయంలో మైనర్‌ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ సమయంలో మైనర్‌ లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమె మెడపై కొరకడం వంటి దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్‌ శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే టాటూలా ఉండాలనే మెడపై కొరికినట్లు నిందితుల వాగ్మాలం ఇచ్చారు. బాలిక ప్రతిఘటించడంతో గాయాలైనట్లు ఒప్పుకున్నారు.

                                      

About Author