PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాగునీటి కోసం రైతన్నల కష్టాలు..

1 min read

కేసి కాలువ తూములు తెరవని లష్కర్లు..

కేసి ఆయకట్టు కింద ఎండుతున్న పంటలు..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  దేశానికి అన్నం పెట్టే రైతన్నను నాటి నుంచి నేటి వరకు దేశానికి వెన్నుముక రైతన్న  అనే నినాదంతో  పాలకులు ముందుకు సాగుతూ ఓట్లు దండుకొని, గద్దెనెక్కిన పాలకులు రైతన్నలను, విస్మరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  నందికొట్కూరు  మండలంలో లోని అల్లూరు వడ్డేమాను, రైతులకు సాగునీటి కష్టాలు తప్పట్లేదు.కేసి కాలువ కింద మొక్కజొన్న, మిరప, మినుము, కంది , పెసర పంటలను రైతులు సాగుచేశారు.  కేసి కాలువలో నీరు ఉన్న పొలాలకు అందని పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కాపాడుకునేందుకు రైతన్నలు నానా కష్టాలు పడుతున్నారు. ఆయకట్టు  పరిధిలో  సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. కేసి కాలువలో పూర్తిస్థాయిలో నీరు ఉన్నా  తూముల ద్వారా  సాగునీరు రాకపోవడంతో ఆయకట్టు పరిధిలోని  అల్లూరు గ్రామ రైతులు  తూములు తెరవడానికి నానా కష్టాలు పడుతున్నారు. సోమవారం తూముల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు.  సాగునీరు విడుదల చేయాల్సిన కేసి కాలువ లష్కర్ లు విధులకు డుమ్మాకొడుతున్నారని రైతులు పేర్కొంటున్నారు.తూములు తెరచి పంట పొలాలకు సాగునీటిని విడుదల చేయడం లో లష్కర్ లు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.లస్కర్ల్ ఎప్పుడు వస్తారో సమాచారం కూడా ఇవ్వరని రైతులు ఆరోపించారు.అధికారులు స్పందించి రైతులకు సాగునీరు అందించాలని కోరుతున్నారు.

About Author