NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అత్యంత మురికి వ్యక్తి ఇక లేరు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా పేరుగాంచిన ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ మృతి చెందాడు. ఆయన వయసు 94 సంవత్సరాలు. అర దశాబ్దానికిపైగా స్నానానికి దూరంగా ఉన్న అమౌ హాజీ అనారోగ్యం బారినపడకుండానే మృతి చెందినట్టు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఇరాన్ దక్షిణ ప్రావిన్స్ అయిన ఫార్స్‌లోని డెజ్గా గ్రామంలో మృతి చెందాడు. ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్థులే దయతలచి ఆయన తలదాచుకునేందుకు చిన్న ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం బారినపడతానన్న భయంతో స్నానాన్ని మానేసిన ఆయన.. సబ్బుతో ముఖం, కాళ్లు చేతులు కూడా ఎప్పుడూ కడుక్కోలేదు. చనిపోయిన మూగజీవాలను తింటూ బతికేవాడు. ఒకేసారి నాలుగైదు సిగరెట్లను ఊదిపడేసేవాడు. స్నానం లేకుండా వింత జీవితాన్ని గడుపుతున్న హాజీపై 2013లో ఓ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. 60 ఏళ్లుగా స్నానానికి దూరమై మురికితో పూర్తిగా దుమ్ముకొట్టుకుపోయిన హాజీకి ఇటీవల గ్రామస్థులందరూ కలిసి బలవంతంగా స్నానం చేయించారు. అది జరిగిన కొన్ని రోజులకే ఆయన మృతి చెందడం గమనార్హం. యువకుడిగా ఉన్నప్పుడు అతడికి ఎదురైన పలు ఘటనలు అతడిని స్నానానికి దూరం చేశాయని గ్రామస్థులు పేర్కొన్నారు.

About Author