NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నగర సుందరీకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

1 min read

– పార్కు అభివృద్ధి పనులను 15 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులకు ఆదేశం…
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : నగరంలోని విజయా డయిరీ సమీపంలో తమ్మిలేరుకు ఆనుకొనియున్న జన్మభూమి పార్కు సుందరీకరణ పనులను 15 రోజుల్లో పూర్తిచేయాలని నగరపాలక సంస్ధ కమీషనరు, ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ అధికారులను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. బుధవారం స్ధానిక జన్మభూమి పార్కులో చేపట్టిన అభివృద్ధి పనులను నగరపాలక సంస్ధ అధికారులతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. పార్కు సుందరీకరణకు సంబంధించి అన్ని మరమ్మత్తులు, అభివృద్ధి పనులు పూర్తిచేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఏలూరు నగర ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో ఈ పార్కుకు వచ్చి ఆనందించేలాగా తీర్చిదిద్దాలన్నారు. అదే విధంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అన్ని పార్కులు కూడా ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమీషనరు సంక్రాంతి వెంకటకృష్ణ , ఎస్ ఇ వెంకటేశ్వరరావు, ఇఇ భాస్కరరావు, డిఇలు కొండలరావు, సత్యనారాయణ, తాతాబ్బాయి, ఏఇలు రామారావు, రాఘవులు, తదితరులు ఉన్నారు.

About Author