PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యవసాయ శాఖ కార్యాలయాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కలెక్టరేట్ సముదాయంలో ఉన్న పశు సంవర్థక,వ్యవసాయ శాఖ కార్యాలయాలను మంగళవారం జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ కలెక్టరేట్ సముదాయంలో నిరుపయోగంగా ఉన్న విద్యుత్ తీగలను తీసి వేసి అవసరం ఉన్న విద్యుత్ తీగలను ఒకే పైప్ లైన్ లో అమర్చాలన్నారు. అలాగే జిల్లా వ్యవసాయ అధికారి వారి కార్యాలయంలో ఉన్న సెమినార్ హల్ కు చేపట్టనున్న మరమ్మతు పనులను ఆర్ అండ్ బీ అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. కార్యాలయంలో అమర్చిన తలుపులను పాలిష్ చేయించడంతో పాటు కార్యాలయంలో సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు వెయ్యి లీటర్ల సింటెక్స్ ట్యాంక్ ఏర్పాటు చేయించాలన్నారు. అదే విధంగా కార్యాలయంలో ఎక్జాస్ట్ ఫ్యాన్లు (exhaust fan) అమర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్న జిరాక్స్ యంత్రాలను సంబంధిత యాజమాన్యంతో సంప్రదించి ఎక్స్చేంజ్ రూపంలో మార్చుకునే అవకాశం ఉంటే మార్చుకోవాలన్నారు. ఓపెన్ గా ఉన్న ప్రదేశాల్లో ఎటువంటి వ్యర్థ పదార్థాలు పారివేయకుండా మెస్ (తెర) ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా కార్యాలయాలలో సంబంధిత శాఖ ప్రగతిని ప్రతిబింబించేలా వాటికి సంబందించిన చిత్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.జిల్లా కలెక్టర్ గారి వెంట జిల్లా వ్యవసాయ అధికారి పిఎల్.వరలక్ష్మి, పశుసంవర్థక శాఖ అధికారి రామచంద్రయ్య, సిపిఓ అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.

About Author