ఉపాధిహామీ పనులు పరిశీలించిన జిల్లా అధికారి అంబుడ్స్ పర్సన్
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండలములోని బిజినవేముల గ్రామ పంచాయతిలో జరుగుచున్న ఉపాధి హామీ పనులను మంగళవారం జిల్లా అధికారి అంబుడ్స్ పర్సన్ ఆర్.సురేంద్ర కుమార్ పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రామంలో జరుగుతున్న కలువలోపుడికతీత పనిని పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడారు.రోజు రూ. 272 కూలీ వేతనం పడాలంటే కొలతల ప్రకారం పనిచేయాలని కూలీలకు సూచించారు.కూలీలకు ఎలాంటి పనులు కావాలని కూలీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హార్టీకల్చర్ పనులను తనిఖీ చేయడమైనది. తనిఖీ లో భాగంగా మునగ రైతుకు పనులపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఉపాధి కూలీల కు ఉపాధి హామీ పథకము పై అవగాహన కల్పించినారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని, ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచాలని,కూలీల నమోదు పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ అలివేలు మంగమ్మ, ఈసీ షభానా ,టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మీ జ్యోతి , ఫీల్డ్ అసిస్టెంట్ పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.