PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలి

1 min read

– జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఐఏయస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు, సెబ్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ పటేల్ ఐపియస్ గారు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు గారు జిల్లాస్థాయి మాదక ద్రవ్యాల నివారణ కమిటీ సభ్యులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో మత్తు పదార్థాల నివారణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై.. జిల్లాస్థాయి మాదక ద్రవ్యాల నివారణ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఐఏయస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు, సెబ్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ పటేల్ ఐపియస్ గారు సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఐఏయస్ గారు మాట్లాడుతూ .పాఠశాలలు మరియు కళాశాలల్లో డీఈవో మరియు వైద్య ఆరోగ్య శాఖ వారు మాదక ద్రవ్యాల వాడకం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, తద్వారా కుటుంబ వ్యవస్థ దుర్బలం కావడం వంటి అంశాలను తెలియజేస్తూ.. మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడం డ్రగ్ ఇన్స్పెక్టర్ జిల్లాలో ప్రతి మెడికల్ షాప్ నందు మరియు ఇతర దుకాణాలలో మాదక ద్రవ్యాలు నిషిద్ధమైన మందులు మరియు ప్రాంతాలలో అమ్మకాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.పోలీసు వారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గురించి నిఘా ఉంచి అక్రమ రవాణాను అరికట్టాలన్నారు, వ్యవసాయ శాఖ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు జిల్లాలో గంజాయి ఇతర మత్తు పదార్థాల పంటల అక్రమ సాగుబడిని నివారించి అలాంటి రైతులకు ప్రభుత్వ పథకాల ద్వారా జీవన ఉపాది కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారు మాట్లాడుతూ …జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో అక్కడక్కడ గంజాయి పంటను పండించి అక్రమ సంపాదనకు ఆలోచించేవారికి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రభుత్వ పథకాల ద్వారా జీవన ఉపాది వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్ ఓ, డ్రగ్ ఇన్స్పెక్టర్, డీఈవో, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author