నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
1 min read
పల్లెవెలుగు కర్నూలు: కర్నూలు నగరంలోని కర్నూలు నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ ను కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు అధికారులకు, పోలీసు సిబ్బందికి సూచించారు. సిబ్బంది పని తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తగిన సూచనలు, సలహాలు చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. నేను సైబర్ స్మార్ట్ అనే అవగాహన కార్యక్రమంతో ప్రజలకు , విద్యార్దులకు అవగాహన కల్పించి సైబర్ నేరాల బారిన పడకుండా చేయాలని ఆదేశించారు.వివిధ కేసులలో పట్టు బడిన వాహనాలను డిస్పోజబుల్ చేయాలన్నారు. యు ఐ కేసులు తగ్గించాలన్నారు. రాత్రి గస్తీ బాగా పెంచాలన్నారు. ట్రాఫిక్ నిబంధనల పై ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ , ఒపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలీసు స్టేషన్ ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ సిఐ మధుసూదన్ గౌడ్, ఎస్సైలు షమీర్ భాషా, చంద్రశేఖర్, గోపినాథ్ , పోలీసుసిబ్బంది ఉన్నారు.