అవుకు ఎస్ఐని అభినందించిన జిల్లా ఎస్పీ
1 min read1) 6 గంటల వ్యవధిలోని కేసును చేదించిన అవుకు పోలీసులు
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో అవుకు మండలం లో .గత రెండు రోజుల క్రితం రామాపురం గ్రామంలోని మల్లు వెంకటేశ్వర రెడ్డి (నడిపెన్న) ఇంట్లో జరిగిన భారీ దొంగతనాన్ని కేవలం ఆరు గంటల వ్యవధిలోనే ఎస్సై జగదీశ్వర రెడ్డి తమ సిబ్బందితో కలిసి కేసును చేదించి ముద్దాయిలను (సూర్యచంద్రుడు,వన్నప్ప రామాంజనేయులు) అరెస్టు చేసి జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ముందర హాజరు పరిచారు.63 తులాల బంగారు 14 లక్షల నగదును రికవరీ చేసి జిల్లా పోలీస్ బాస్ రఘువీర్ రెడ్డి చేతుల మీదుగా రివార్డును అందుకుని ప్రశంసలు పొందారు.దొంగతనం జరిగిన కేసును చాలెంజ్ గా తీసుకొని కొద్ది గంటల వ్యవధిలోనే చేదించడంతో అవుకు ఎస్సై పై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇంటి యజమాని నమ్మిన వ్యక్తులే దొంగతనానికి పాల్పడడంతో మండలంలో చర్చ జరుగుతుంది.ఇంత భారీ స్థాయిలో దొంగతనం జరగడం అవుకు మండలంలో ఇదే ప్రథమం. అనంతరం ముద్దాయిలను రిమాండ్ కు తరలించారు.ఎస్సై తో పాటు అవుకు పోలీసులైన జిలాని,వెంకటేష్ నాయక్, హోంగార్డు చక్రవర్తి లను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు.మండలంలో ఎవ్వరే గాని ఇలాంటి దొంగతనాలకు పాల్పడితే కటకటాల పాలవ్వక తప్పదని ఎస్సై ఈ సందర్భంగా హెచ్చరించారు.