PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆస్పరి పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆస్పరి: జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ శుక్రవారం ఆస్పరి పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు.పోలీసు స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. పోలీసుస్టేషన్ లోని చిత్ర పటాలను పరిశీలించి సమస్యాత్మక, ఫ్యాక్షన్ గ్రామాల గురించి ఆరా తీశారు.ఏ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తు ను త్వరగా పూర్తి చేయాలని ఆస్పరి ఎస్సై గారికి తగిన సూచనలు, సలహాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆస్పరి ఎస్సై వర ప్రసాద్ ఉన్నారు.

About Author