జడ్పీల విభజన ఇప్పట్లో లేనట్లే !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీలో జిల్లా పరిషత్‌ల విభజన ఇప్పట్లో లేనట్లేనని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జడ్పీల విభజనపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని తెలిపారు. ప్రస్తుతమున్న జిల్లా పరిషత్‌ల నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పారు. అధ్యయనం తర్వాత జడ్పీల విభజనపై విధివిధానాలు ప్రకటిస్తామని బొత్స స్యతనారాయణ తెలిపారు.